News November 19, 2024

WGL: రైతులకు నిరాశ.. మళ్లీ పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. గత వారం గరిష్ఠంగా రూ.7,000 పలికిన క్వింటా కొత్త పత్తి ధర.. సోమవారం భారీగా పతనమై రూ.6,750కి పడిపోయింది. నేడు మరింత తగ్గి రూ.6,730 కి చేరింది. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News July 8, 2025

WGL: నేడు 118 విద్యాలయాల్లో ‘స్ఫూర్తి’

image

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో స్ఫూర్తి
కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 విద్యాలయాల్లో బ్యాంకర్లు, జర్నలిస్టులు, సీనియర్ సిటిజన్లు సమాజంలో జరుగుతున్న సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.

News July 8, 2025

వరంగల్ జిల్లాలో 37.6 శాతం వర్షాపాతం నమోదు

image

జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో వర్షపాతం మోస్తరుగా నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 37.6 శాతం నమోదైంది. గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, ఖిలా వరంగల్, మండలాల్లో మోస్తరు వర్షం కురవగా పర్వతగిరిలో వర్షం కురువలేదని తెలిపారు. వర్ధన్నపేట, రాయపర్తి, ఖానాపూర్, చెన్నారావుపేట, ఖానాపూర్, నర్సంపేట, మండలాల్లో తక్కువ వర్షాపాతం నమోదైంది.

News July 8, 2025

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా సూర్యనారాయణ

image

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా వరంగల్‌కు చెందిన సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. రేషన్ డీలర్ల కష్ట సుఖాలు పాలుపంచుకుని వారి సమస్యలు తీర్చడానికి సంఘం తరఫున అన్ని విధాలా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. పోస్ట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.