News September 3, 2024

WGL: వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. శాస్త్రవేత్తల సూచనలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నీటి మునిగాయి. దీంతో పంటకు తెగులు సోకే ప్రమాదం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్ డా.ఉమారెడ్డి సూచించారు. పత్తిలో నీటిని తీసివేసి, ఎకరాకు 30కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ వేయాలని.. మిరపకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా. తెగులు సోకిన మొక్కల మొదళ్లకు పోయాలని సూచించారు.

Similar News

News November 17, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో విశ్వక్ సేన్

image

వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని సినీ హీరో విశ్వక్ సేన్ సందర్శించారు. విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతోంది. దీంతో నగరానికి చేరుకున్న సినీ బృందం ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

News November 17, 2024

నేడు కొమురవెల్లిలో మాయాబజార్ నాటక ప్రదర్శన

image

కొమురవెల్లి శ్రీ మల్లన్న స్వామి ఆలయ సమీపంలో నేడు శ్రీ వినాయక నాట్యమండలి (సురభి) వారి ఆధ్వర్యంలో మాయాబజార్ నాటక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. భక్తులు, ఆలయ సమీప గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని నాటకాన్ని తిలకించి విజయవంతం చేయాలని కోరారు.

News November 17, 2024

WGL: నిరుద్యోగులకు ఈనెల 20న జాబ్ మేళా

image

వరంగల్ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి శనివారం తెలిపారు. హెచ్‌డి‌ఎఫ్‌సిలో 50, ముత్తూట్ ఫిన్ కార్ప్‌లో 100, సర్వాగ్రామ్ ఫైనాన్స్‌లో 15 ఖాళీల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ వరంగల్ ఐటిఐ బాయ్స్ క్యాంపస్‌కు రావాలన్నారు.