News September 22, 2024

WGL: వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2024-25 వానాకాలం ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలన్నారు.

Similar News

News October 5, 2024

WGL: సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా

image

సచివాలయంలోని అటవీ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ‘ఎకో టూరిజం’పై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎకో టూరిజం అభివృద్ధిపై కాసేపు అధికారులతో మంత్రి చర్చించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రీయాల్, తదితరులు ఉన్నారు.

News October 5, 2024

WGL: ఒకే ఏడాది.. 3 GOVT JOBS

image

ఒకే సంవత్సరంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు ఏజెన్సీకి చెందిన యువకుడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన మాదరపు అశోక్ ఎం.ఏ, బీఈడీ చదివాడు. మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పరీక్షలో ఆరో జోన్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌కు ఎంపికయ్యాడు. హాస్టల్ వార్డెన్ ఫలితాల్లోనూ ఉద్యోగం సాధించాడు.

News October 5, 2024

WGL: అడవి పందిని చంపిన వారిపై కేసు నమోదు

image

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామ శివారులోని హనుమాన్ టెంపుల్ సమీప అడవిలో ఇటీవల అడవి పందిని చంపి మాంసం విక్రయిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి అడవి పంది మాంసం విక్రయిస్తున్న రమేశ్, భీముడు, సంపత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేసి శనివారం వారికి రూ.50 వేల జరిమానా విధించారు.