News March 7, 2025

WGL: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు గడువు పొడిగించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జనగామ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

Similar News

News March 7, 2026

SVU: పరీక్ష ఫీజు చెల్లించండి.!

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో డిగ్రీ (UG) 4, 6 సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ నెలలో జరగనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. మార్చి 21వ తేదీలోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 7, 2026

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కూతురికి సివిల్స్‌లో 573వ ర్యాంక్

image

విశాఖకి చెందిన శ్వేత గుమ్మల సివిల్ సర్వీసెస్ పరీక్షలో 573వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. ఆమె తండ్రి రాజాబాబు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. శ్వేత విశాఖలో పాఠశాల విద్య, జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తరువాత IIT హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసింది. కృషి, పట్టుదలతో సివిల్స్‌లో ర్యాంక్ సాధించి కుటుంబానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

News March 7, 2026

జగిత్యాల: వ్యవసాయానికి బ్యాంకులు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

image

వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ బీఎస్. లత అన్నారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలో 26 బ్యాంకులు 135 శాఖల ద్వారా సేవలు అందిస్తున్నాయని, మొత్తం బ్యాంకింగ్ వ్యాపారం రూ.16,910 కోట్లకుపైగా ఉందన్నారు. రైతులు, బలహీన వర్గాలు, మహిళలకు బ్యాంకులు మరింత రుణాలు అందించాలని సూచించారు.