News March 7, 2025
WGL: విద్యార్థులకు ముఖ్య గమనిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు గడువు పొడిగించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జనగామ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 28, 2026
తాలిబన్ల పవర్: ఎయిర్ ఫోర్స్ లేకుండానే పాక్ గుండెలపై దాడి.. ఎలా?

సరిహద్దు నుంచి 200km దూరంలో ఉన్న ఇస్లామాబాద్‌పై తాలిబన్లు దాడులు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సరైన శిక్షణ లేని సైన్యం అంత లోపలికి వెళ్లగలగడానికి అమెరికా వదిలి వెళ్లిన అడ్వాన్స్‌డ్ డ్రోన్ టెక్నాలజీయే కారణం. ముఖ్యంగా నిఘా, అటాక్స్‌కు ఉపయోగించే UAVల ద్వారా వారు పాక్ ఎయిర్ డిఫెన్స్‌ను తప్పించుకోగలిగారు. తక్కువ వనరులున్నప్పటికీ కచ్చితమైన ఇంటెలిజెన్స్‌తో పాక్‌పై డ్రోన్ ఆపరేషన్లను నిర్వహించారు.
News February 28, 2026
Don’t miss: నేడు బాలికలకు ఫ్రీగా HPV టీకా

సర్వైకల్ క్యాన్సర్ కేసుల కట్టడే లక్ష్యంగా ఇవాళ 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్ జరగనుంది. PM మోదీ రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో జాతీయస్థాయి టీకా కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. APలో CM CBN రావివలస(విజయనగరం)లో, TGలో మంత్రి రాజనర్సింహ HYD కోఠిలో ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 6.75L మందికి పంపిణీ చేస్తారు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.
#ShareIt
News February 28, 2026
వర్కవుట్స్ అంటే చిరాకా? ఈ టిప్స్‌తో ఫిట్‌గా ఉండొచ్చు..!

జిమ్‌లో కష్టపడటం ఇష్టం లేనివారు ఫిట్‌గా ఉండేందుకు సింపుల్ టిప్స్ ఉన్నాయి. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం ద్వారా డైలీ మూవ్‌మెంట్ పెంచాలి. నచ్చిన డాన్స్, స్విమ్మింగ్ వంటి పనులతో యాక్టివ్‌గా ఉంటూ రోజుకు 10వేల అడుగుల గోల్ పెట్టుకోవాలి. ఇంట్లోనే సింపుల్ పుష్-అప్స్, ఫ్రెండ్స్‌తో కలిసి వాకింగ్ చేస్తే బోర్ కొట్టదు. ప్రొటీన్, ఫైబర్ ఉన్న డైట్ తీసుకుంటే జిమ్‌కు వెళ్లకున్నా ఫిట్‌గా ఉండొచ్చు.


