News February 5, 2025

WGL: విషాదం.. గుండెపోటుతో యువకుడు మృతి

image

వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈరోజు ఉదయం ఓ యువకుడు హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. నగరంలోని డాక్టర్స్ కాలనీకి చెందిన కుమారస్వామి(33) ఈరోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, 3 నెలల పాప ఉంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News September 16, 2025

అరకు: ‘కాఫీ బెర్రీ బోరర్ సమస్య అదుపులోకి వచ్చినట్లే’

image

కాఫీ బెర్రీ బోరర్ కీటకం సమస్య అదుపులోకి వచ్చినట్లేనని అరకు ఉద్యానశాఖ అధికారిణి శిరీష తెలిపారు. అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లో సుమారు 33 పంచాయతీల్లో 105 గ్రామాల్లో 5,176 ఎకరాల్లో సర్వే చేసి, 150 ఎకరాల్లో కీటకం సోకినట్లు గుర్తించామన్నారు. ఆయా తోటల్లో కాఫీ పంటను మొత్తం కోసి, ఉడకబెట్టి, భూమిలో పాతిపెట్టడం జరిగిందన్నారు. బెర్రీ బోరర్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, రైతులు సహకరించాలని కోరారు.

News September 16, 2025

నెల్లూరు నగరపాలక సంస్థలో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు

image

నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇన్‌ఛార్జ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ శివకుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కమిషనర్ నందన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని కనకమహాల్ సెంటర్లో మూడంతస్తుల భారీ భవంతి నిర్మిస్తున్నారు. దానికి ఎలాంటి అనుమతులు లేవు. వ్యవహారాన్ని మేయర్ స్రవంతి ఇటీవల బయటపెట్టడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.

News September 16, 2025

16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధం

image

డ్రగ్ ట్రాఫికింగ్ కేసుల్లో పట్టుబడిన 16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది. వారిని స్వదేశాలకు పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) సమర్పించిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే రాష్ట్రాల వారీగా డ్రగ్ ట్రాఫికర్స్ జాబితా సిద్ధం చేసి కేంద్ర హోం శాఖకు పంపినట్లు వెల్లడించాయి.