News February 5, 2025

WGL: విషాదం.. గుండెపోటుతో యువకుడు మృతి

image

వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈరోజు ఉదయం ఓ యువకుడు హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. నగరంలోని డాక్టర్స్ కాలనీకి చెందిన కుమారస్వామి(33) ఈరోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, 3 నెలల పాప ఉంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News February 18, 2026

మార్కుల్లో తేడా వస్తే టీచర్‌కు ఫైన్!

image

AP: పదో తరగతి మూల్యాంకనంలో పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. రీకౌంటింగ్‌లో 5 కంటే ఎక్కువ మార్కుల తేడా వస్తే మూల్యాంకనం చేసిన టీచర్‌కు రూ.1500 నుంచి రూ.4000 వరకు ఫైన్ విధించనుంది. ఒక పేపర్‌ను తప్పకుండా 12 నిమిషాలు దిద్దాలనే నిబంధన పకడ్బందీగా అమలు చేయనుంది. గతేడాది వ్యాల్యూయేషన్‌లో భారీగా తప్పులు దొర్లడం, ఓ స్టూడెంట్‌కు ఏకంగా 30 మార్కులు తక్కువ వేయడం పెద్ద వివాదమైంది.

News February 18, 2026

అనంత: ఈ నెల 21 నుంచి పలు రైళ్లు రద్దు

image

ధర్మవరం-పెనుకొండ మధ్య రైల్వే పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. గుంతకల్లు-హిందూపురం (77213/14), బెంగళూరు-అనంతపురం మధ్య నడిచే (66559/60) రైళ్లను ఈనెల 22వ తేదీ వరకు రద్దు చేశారు. మచిలీపట్నం- ధర్మవరం మధ్య నడిచే రైళ్లు ఈనెల 21, 22 తేదీల్లో అనంతపురం వరకు నడుస్తాయి. అనంతపురం – ధర్మవరం మధ్య రద్దు చేయడంతో అనంతపురం వచ్చి తిరిగి మచిలీపట్నం వెళ్తాయి.

News February 18, 2026

విజయవాడ: బాలికపై అత్యాచారయత్నం.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

image

AP అసెంబ్లీ ఉద్యోగి BK మునిరాజాని నున్న పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికపై అత్యాచారయత్నం, లైంగిక దాడి, కుల దూషణ, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, బ్లాక్ మెయిల్, ఫోర్జరీ కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తల్లి, కూతురిని 2 ఏళ్లుగా ఆర్థికంగా మునిరాజా వేధించినట్లు విచారణలో తేలగా, విజయవాడ కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. తూనికలు, కొలతల శాఖలో వసూల్ రాజాగా మునిరాజా ప్రసిద్దికెక్కాడు.