News May 4, 2024
WGL: వృద్ధులు 14,339.. దివ్యాంగులు 30,162

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో రెండో రోజు హోం ఓటింగ్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటింగ్లో పాల్గొంటున్నారు. వరంగల్ లోక్ సభ పరిధిలో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 14,339 మంది ఉండగా..దివ్యాంగులు 30,162 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.
Similar News
News April 23, 2025
వరంగల్: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం మంగళవారం వెలువడ్డాయి. ఫలితాల్లో వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటినట్లు డీఐఈవో డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 4 శాతం ఉత్తీర్ణత పెరిగిందని, జిల్లా స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను తగు రీతిలో సత్కరించనున్నట్లు తెలిపారు..
News April 23, 2025
వరంగల్: గ్రేట్.. ఒకే ఏడాదిలో 11 మందికి ఆర్మీలో జాబ్స్

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని గిరిజన సంక్షేమ సైనిక్ స్కూల్ నుంచి ఒకే ఏడాదిలో 11 మంది అగ్నివీర్‌లో ఉద్యోగాలు సాధించారు. గత నెలలో ఇదే పాఠశాలకు చెందిన 8 మందికి జాబ్స్ వచ్చాయి. రెండు రోజుల క్రితం విడుదలైన రెండో విడుత ఫలితాల్లో మరో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వ కొలువులు వచ్చాయి. ఉపాధ్యాయుల అంకితభావంతోనే ఈ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు.
News April 22, 2025
వరంగల్: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

వరంగల్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 4967 మంది పరీక్షలు రాయగా 2890 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 58.18 శాతం నమోదైంది. ఇందులో బాలికలు మొత్తం 2989 మందికి గాను 2039(68.22%) ఉత్తీర్ణులయ్యారు. బాలురులో మొత్తం 1978 మందికి గాను 851 మంది (43.02%) ఉత్తీర్ణులయ్యారు.