News March 3, 2025
WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్కు రాజీనామా చేశారు.
Similar News
News December 5, 2025
రేపు వాయిదా పడిన డిగ్రీ పరీక్ష నిర్వహణ

యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలో డిసెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష తుఫాను కారణంగా వాయిదా పడింది. ఆరోజు జరగాల్సిన పరీక్ష ఈ నెల 6న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. ప్రతి విద్యార్థి పరీక్షకు తప్పక హాజరు కావాలన్నారు.
News December 5, 2025
చింతలపాలెంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

చింతలపాలెం మండలంలోని నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుక్రవారం పరిశీలించారు. చింతలపాలెం, దొండపాడు, మేళ్లచెర్వు, రామాపురం పంచాయతీల్లోని సర్పంచ్-వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రాలను ఆయన సందర్శించారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆర్.ఓ.లకు సూచించారు. సందేహాలున్నవారు హెల్ప్డెస్క్ను వినియోగించుకోవాలన్నారు.
News December 5, 2025
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.


