News March 3, 2025
WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్కు రాజీనామా చేశారు.
Similar News
News November 27, 2025
శబరిమల యాత్రికుల విశ్రాంతి ప్రదేశం

శబరిమలకు వెళ్లే యాత్రికులు బస చేసే ప్రాంతమే ‘శిరియాన వట్టం’. ఒకప్పుడు ఇక్కడ ఏనుగుల సంచారం అధికంగా ఉండేది. కాలక్రమేణా భక్తుల రద్దీ పెరగడంతో వాటి రాక తగ్గింది. ఈ ప్రాంతం శబరిమల యాత్రికులకు ముఖ్యమైన విడిది కేంద్రంగా మారింది. తమ కఠినమైన ప్రయాణంలో అలసిపోయిన భక్తులు ఇక్కడి నుంచి పంబ నది వరకు తాత్కాలిక బస ఏర్పాటు చేసుకుంటారు. వంటలు చేసుకొని భుజించి, విశ్రమిస్తుంటారు. <<-se>>#AyyappaMala<<>>
News November 27, 2025
వరంగల్: బ్యాంకుల్లో నగదుకు కటకట

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బ్యాంకుల్లో నగదుకు కొరత ఏర్పడింది. పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల నుంచి పోస్టాఫీసులకు నగదు తరలింపు పెద్ద సమస్యగా మారింది. కలెక్టర్లు పక్క జిల్లాల నుంచి సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా పెన్షన్ల కోసం డబ్బు విడుదల కావట్లేదని సమాచారం. బిహార్ ఎన్నికల కోసం భారీగా నగదును తరలించడంతో సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క ఆర్బీఐ నుంచి కూడా నగదు సరఫరా లేనట్లు సమాచారం.
News November 27, 2025
ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సై..!

ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. నేటి (గురువారం) నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు, 3,822 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ శనివారం వరకు కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలించి, అర్హత జాబితాను అధికారులు వెల్లడిస్తారు. బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.


