News November 16, 2024

WGL: సీఎం పర్యటన పనులను పరిశీలించిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

image

ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, డాక్టర్ సత్య శారదా, దివాకర టీఎస్, రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ, GWMC అశ్విని తానాజీ వాకడే శనివారం పరిశీలించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

Similar News

News December 3, 2024

దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

image

రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంతా చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులు ఏ రంగంలో ఉన్నా వారిని ప్రోత్సహించాలని కోరారు. అంగవైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.

News December 3, 2024

విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న HNK NPDCL కార్యాలయం

image

హనుమకొండలోని NPDCL కార్యాలయాన్ని సోమవారం విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా ఈనెల 1 నుంచి 9 వరకు జరిగే ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించామని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో విద్యుత్ కాంతులు అటుగా వెళ్లే వాహనదారులను ఆకర్షించాయి.

News December 2, 2024

సిద్దేశ్వరుడికి భక్షాలతో మహా నివేదన

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్ధేశ్వరాలయంలో మార్గశిర మాసం సోమవారం పోలీ స్వర్గం సందర్భంగా సిద్ధేశ్వరుడికి భక్షాలతో మహా నివేదన, ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దేశ్వరాలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని పలు ఆలయాల్లో నేడు భక్తుల సందడి నెలకొంది.