News July 14, 2024

WGL: సీఎస్సీ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

image

కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ, వీఎల్ఈ)ల కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పాలకుర్తికి చెందిన మాసంపల్లి నాగయ్య, సహాయ కార్యదర్శిగా రాపోలు లక్ష్మణ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని కామన్ సర్వీస్ సెంటర్ కార్యాలయంలో వీఎల్ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు.

Similar News

News December 12, 2024

అరెస్టు చేయడం దుర్మార్గం: కేటీఆర్

image

గిరిజన హాస్టల్‌లో విషాహార బాధిత పిల్లలను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పార్టీ సీనియర్ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని సిరిసిల్ల MLA KTR ట్వీట్ చేశారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేస్తున్న ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం కాకుండా, పసిబిడ్డలకు పోషకాహారం అందించడం, సరైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టడం మంచిదన్నారు.

News December 12, 2024

భీమునిపాదం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలని వినతి

image

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరంను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ కలిశారు. గూడూరు మండల పరిధిలోని భీమునిపాదం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలని కోరారు. స్థానిక గిరిజన యువత ఉపాధి కల్పించుటకు చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై కాసేపు కేంద్రం మంత్రితో హుస్సేన్ నాయక్ చర్చించారు. 

News December 12, 2024

కేయూ పరిధిలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

కేయూ పరిధిలో ఈ నెల 18న జరగాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. తిరిగి పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజేందర్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల వాయిదా విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.