News February 21, 2025
WGL: స్ప్రింగ్ స్ప్రీ-2025 వేడుకలకు బ్రహ్మానందం

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) WGL ప్రతిష్ఠాత్మక వార్షిక సాంస్కృతిక మహోత్సవమైన స్ప్రింగ్ స్ప్రీ-2025కు ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు హాజరు కావాలని పద్మశ్రీ డా.బ్రహ్మానందంకు ఆహ్వానం అందజేశారు. ఈ మేరకు NIT ఉన్నతాధికారులు గురువారం బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. వేడుకలకు తప్పకుండా వస్తానని బ్రహ్మానందం తెలిపినట్లు వారు చెప్పారు. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు స్ప్రింగ్ స్ప్రీ జరగనుంది.
Similar News
News December 3, 2025
జీడిమామిడిలో టీ దోమ పూర్తి నివారణకు సూచనలు

జీడిమామిడి కొత్త చిగురు వచ్చే సమయంలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. పూత వచ్చాక లీటరు నీటికి లాంబ్డాసైహలోథ్రిన్ 0.6ml లేదా క్లోరీపైరిఫాస్ 2mlను కలిపి పిచికారీ చేయాలి. గింజ బటాని సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి ప్రోఫెనోఫోస్ 1ml కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులను మార్చి నెల వరకు అవసరాన్నిబట్టి 2 లేక 3 సార్లు కాండం, కొమ్మలు, ఆకులు, చిగుర్లు, పూత, పిందే తడిచేలా పిచికారీ చేయాలి.
News December 3, 2025
BREAKING.. తాండూరు: నామినేషన్ పత్రాలు చోరీ

పెద్దేముల్ మండలం గొట్లపల్లి నామినేషన్ క్లస్టర్‌లోని కార్యాలయం తాళం పగులగొట్టి నామినేషన్ పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గొట్లపల్లి క్లస్టర్లో దాఖలైన హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండా(ఐ) గ్రామాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, తహశీల్దార్ వెంకటేష్ ప్రసాద్ క్లస్టర్‌ను సందర్శించారు.
News December 3, 2025
జగిత్యాల: ‘చివరిరోజు రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలి’

గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ సత్యప్రసాద్ గొల్లపల్లి, చిల్వకోడూర్, తిరుమలాపూర్, నంచర్ల కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్లు ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం స్వీకరించాలని, చివరిరోజున రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.


