News February 21, 2025

WGL: స్ప్రింగ్ స్ప్రీ-2025 వేడుకలకు బ్రహ్మానందం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) WGL ప్రతిష్ఠాత్మక వార్షిక సాంస్కృతిక మహోత్సవమైన స్ప్రింగ్ స్ప్రీ-2025కు ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు హాజరు కావాలని పద్మశ్రీ డా.బ్రహ్మానందంకు ఆహ్వానం అందజేశారు. ఈ మేరకు NIT ఉన్నతాధికారులు గురువారం బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. వేడుకలకు తప్పకుండా వస్తానని బ్రహ్మానందం తెలిపినట్లు వారు చెప్పారు. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు స్ప్రింగ్ స్ప్రీ జరగనుంది.

Similar News

News October 16, 2025

POLITICAL: ‘అచ్చంపేటకు ఆయన వస్తున్నారా?’

image

అచ్చంపేట మాజీ MLA గువ్వల బాలరాజు ఇటీవల BRSకు రాజీనామా చేసి BJPలో చేరిన విషయం తెలిసిందే. దీంతో అచ్చంపేట BRSకు సారథి లేరనే చర్చ నడుస్తోంది. అచ్చంపేట SC రిజర్వ్‌డ్ కావడంతో ఉమ్మడి పాలమూరు బిడ్డ, BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచి ఉంటారనే చర్చ నడుస్తోంది. కాగా 2024లో BRS తరఫున నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. అచ్చంపేటకు ఆయన వస్తారనే చర్చపై మీ కామెంట్?

News October 16, 2025

పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన నల్గొండ కలెక్టర్‌

image

శాలిగౌరారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) కలెక్టర్‌ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్య అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 16, 2025

నిర్మల్: వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు

image

జిల్లా వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. కాలేజీలో ఒబెస్ట్రిక్ గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 4, సీనియర్ రెసిడెంట్ 2, రేడియో డయగ్నోసిస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1, సీనియర్ రెసిడెంట్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి కాలేజీలోనే ఈ నెల 22న ఇంటర్వ్యూలు ఉండనున్నాయి.