News February 21, 2025
WGL: స్ప్రింగ్ స్ప్రీ-2025 వేడుకలకు బ్రహ్మానందం

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) WGL ప్రతిష్ఠాత్మక వార్షిక సాంస్కృతిక మహోత్సవమైన స్ప్రింగ్ స్ప్రీ-2025కు ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు హాజరు కావాలని పద్మశ్రీ డా.బ్రహ్మానందంకు ఆహ్వానం అందజేశారు. ఈ మేరకు NIT ఉన్నతాధికారులు గురువారం బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. వేడుకలకు తప్పకుండా వస్తానని బ్రహ్మానందం తెలిపినట్లు వారు చెప్పారు. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు స్ప్రింగ్ స్ప్రీ జరగనుంది.
Similar News
News March 26, 2025
సూసైడ్ చేసుకుంటానని భర్తను బెదిరించడం క్రూరత్వమే: హైకోర్టు

సూసైడ్ చేసుకుంటానంటూ భర్తను, అతడి కుటుంబాన్ని భార్య బెదిరించడం క్రూరత్వం కిందికే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భార్య అలా చేస్తే భర్త విడాకులు తీసుకోవడంలో తప్పేం లేదని తేల్చిచెప్పింది. భార్య సూసైడ్ పేరిట తమ కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపిస్తూ ఓ భర్త దిగువ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. కోర్టు మంజూరు చేయగా భార్య హైకోర్టుకెళ్లారు. ఆ కేసు విచారణలో ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.
News March 26, 2025
KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
News March 26, 2025
‘విజయనగరం జిల్లాలో రూ.194 కోట్లు చెల్లించాం’

విజయనగరం జిల్లాలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 91,836 మంది రోగులు వైద్య సేవలు పొందారని జిల్లా మేనేజర్ రాంబాబు తెలిపారు. జిల్లాలో 66 ప్రభుత్వ ఆసుపత్రులు, 25 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో మొత్తం రూ.194 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రూ.20లక్షల వరకు ప్యాకేజీ పెంచినట్లు వెల్లడించారు.