News January 30, 2025
WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.
Similar News
News September 19, 2025
కాగజ్నగర్: విజేతలకు బహుమతుల ప్రదానం

కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీ గ్రౌండ్లో నిర్వహించిన కబడ్డీ టోర్నీ విజేతలకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుతో కలిసి ఈరోజు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కాగజ్నగర్ సెవెన్ స్టార్స్ జట్టుకు రూ.50,000, ద్వితీయ బహుమతి సిర్పూర్ బజరంగ్దళ్ టీమ్కు రూ.25,000, తృతీయ బహుమతి బెజ్జూరు మండలం అర్కగూడా టీంకు రూ.15,000 నగదుతో పాటు షీల్డ్లు అందజేశారు.
News September 19, 2025
పెద్దపల్లి: మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలి: DMHO

మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి వాణిశ్రీ అన్నారు. గురువారం పట్టణ మాతా శిశు కేంద్రంలో ‘స్వస్థ నారి స్వశక్తి పరివార్’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం 35 ఏళ్ల పైబడిన మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అన్ని పరీక్షలు, వైద్య సేవలు అందిస్తున్నదని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News September 19, 2025
ఆసిఫాబాద్లో మహిళ అదృశ్యం.. కేసు నమోదు

ఆసిఫాబాద్ మండలం సామెల తుంపల్లికు చెందిన ఆత్రం వర్ష అనే మహిళ అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఈరోజు తెలిపారు. ఈనెల 16న తన పుట్టింటి నుంచి వచ్చిన ఆమె తుంపల్లి ఆటో స్టాండ్ వద్ద ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వర్ష భర్త భగవంత్ రావు గురువారం ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.