News January 30, 2025
WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.
Similar News
News November 14, 2025
ములుగు కలెక్టర్‌ను ఇంటర్వ్యూ చేసిన బాలలు

ములుగు కలెక్టర్ దివాకర్‌ను విద్యార్థులు ఇంగ్లిషులో ఇంటర్వ్యూ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా ఇంగ్లిష్ లెర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్‌తో ముఖాముఖి నిర్వహించారు. అలవాట్లు, అభిరుచులు, తదితర విషయాలను అడిగారు. జిల్లాలోని 72 ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ చదవడం, నేర్చుకోవడం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
News November 14, 2025
మంత్రి లోకేశ్‌తో ఉష్ణమండల వ్యాధుల అధ్యయనాలపై చర్చలు

CII సమ్మిట్ సందర్భంగా ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా-ఇండియా CEO ఫోరమ్ డైరెక్టర్ జోడి మెక్కే, విశాఖ జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌ను కలిశారు. తీరప్రాంత, సముద్ర పరిశోధన, ఉష్ణమండల వ్యాధుల అధ్యయనాలు, స్థిరమైన పర్యాటకం,గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఏయూ భాగస్వామ్య బలోపేతంపై మాట్లాడారు. రాష్ట్రంలో ఉష్ణమండల నీటి పరిశోధన, ఆరోగ్యసంరక్షణ కేంద్రం ఏర్పాటుపై చర్చించారు.
News November 14, 2025
వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పసికూన UAE-Aని భారత్-A బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్నారు. దోహాలో జరుగుతున్న టీ20లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైభవ్ ఏకంగా 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదారు. దీంతో ఇండియా-A 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 149 రన్స్ చేసింది.


