News January 30, 2025
WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.
Similar News
News February 19, 2025
విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్

హైదరాబాద్-విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో వెళ్లే లహరి-నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.
News February 19, 2025
ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు నిర్మల్ కలెక్టర్ స్వాగతం

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల సేకరణపై బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణా ఆదిత్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. ఆమెతో పాటు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఉన్నారు.
News February 19, 2025
శాంతిభద్రతల సమస్య లేకుండా చూస్తాం: నిర్మల్ ఎస్పీ

శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం బైంసాలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. భైంసా సబ్ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.