News January 30, 2025
WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.
Similar News
News November 19, 2025
లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్గఢ్లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.
News November 19, 2025
నాగర్కర్నూల్లో పెరిగిన చలి

నాగర్కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 13.2గా నమోదైంది. అమ్రాబాద్, తోటపల్లిలో 13.9, సిర్సనగండ్లలో 14.1 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో అధిక చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
News November 19, 2025
50 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం: లడ్డా

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. ‘ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అరెస్టులు జరిగాయి. భారీగా ఆయుధాలు కూడా సీజ్ చేశాం. నిన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారు. ఛత్తీస్గఢ్/తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు.


