News January 30, 2025
WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.
Similar News
News November 7, 2025
రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో CBN

సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు. కాగా గత వారం పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన సమయంలో ఇక ప్రతివారం ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News November 7, 2025
గుంటూరు జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

రహదారి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కాజా టోల్గేట్, తాడికొండ అడ్డరోడ్డు, పేరేచర్ల, నారాకోడూరు, నందివెలుగు రోడ్డు, వాసవి క్లాత్ మార్కెట్, చుట్టుగుంట ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. 78 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటూ రూ. 7,79,720 జరిమానా విధించామని SP వకుల్ జిందాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అంబులెన్స్ సీజ్ చేశామన్నారు.
News November 7, 2025
ఆదిలాబాద్: పార్శిల్ డెలివరీ అంటూ ఏం చేశారంటే..!

సైబర్ నేరగాళ్ల వలలో మరో వ్యక్తి మోసపోయాడు. పార్శిల్ డెలివరీలో ఇబ్బందులు ఉన్నాయంటూ వచ్చిన మెసేజ్ కారణంగా బాధితుడు రూ.46,408 పోగొట్టుకున్నాడు. వన్ టౌన్ CI సునీల్ వివరాల మేరకు.. శాంతినగర్ కు చెందిన బిలాల్ కు ఇండియా పోస్టు డెలివరీ యువర్ పార్సెల్ వాజ్ అన్సక్సెస్ఫుల్ డ్యూ టూ ఇన్కరెక్ట్ అడ్రస్ అనే సాధారణ మెసేజ్ వచ్చింది. వెబ్ సైట్ లో అతను అప్డేట్ చేయగా డబ్బులు పోగొట్టుకున్నాడు. శుక్రవారం ఫిర్యాదు చేశాడు.


