News February 21, 2025
WGL: స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.13,600 పలకగా.. నేడు 100 పెరిగి రూ.13,700కి చేరింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి నిన్న రూ.16,300 ధర రాగా.. ఈరోజు రూ. 16,500కి పెరిగింది. మరోవైపు 341 రకం మిర్చికి నిన్న రూ.13,300 ధర వస్తే.. నేడు రూ.13,200కి తగ్గింది.
Similar News
News November 20, 2025
వరంగల్: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనిఖీల కోసం చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేని ఇసుక రవాణాపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. విజిలెన్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 20, 2025
వరంగల్ కలెక్టర్‌ను అభినందించిన ఎమ్మెల్యే రేవూరి

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరీ-2లో తొలి స్థానం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అభినందించారు. డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు, రూ. కోటి బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన కలెక్టర్ ను ప్రశంసించారు.
News November 20, 2025
వరంగల్: ‘స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి’

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో సర్పంచ్ ఎన్నికల ఏర్పాట్లు, రిజర్వేషన్లు, ఓటరు జాబితాలపై ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్య రాణి తదితరులు పాల్గొన్నారు.


