News April 13, 2025
WGL: హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?..

వరంగల్(D) నల్లబెల్లి(M) మూడు చెక్కలపల్లిలో శనివారం బానోత్ కొమ్మలు(36) అనే వ్యక్తి <<16081748>>హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. అయితే సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మొక్కజొన్న చేనులో కొమ్మలు మృతదేహం లభ్యమైంది. ఆయన శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News March 15, 2026
ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యం: కలెక్టర్

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. ఆదివారం కర్నూలులోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాసకులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలని కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.
News March 15, 2026
TVKతో పొత్తు ఉండదు: పళనిస్వామి

TNలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో TVKతో పొత్తు ఉండబోదని AIADMK జనరల్ సెక్రటరీ K.పళనిస్వామి తెలిపారు. మీడియాలో వస్తున్నవంతా వదంతులేనని కొట్టిపారేశారు. ఇప్పటి వరకు ఆ పార్టీతో అసలు చర్చలే జరపలేదన్నారు. అలాగే BJP లీడర్ అన్నామలైతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు NDAతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్టార్ హీరో, TVK చీఫ్ విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
News March 15, 2026
రేపటి నుంచి ‘రైతన్న మీకోసం’

నంద్యాల జిల్లాలోని వివిధ గ్రామాల్లో సోమవారం నుంచి ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో 25వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ప్రభుత్వ పథకాలు, ఇతర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.


