News April 13, 2025
WGL: హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?..

వరంగల్(D) నల్లబెల్లి(M) మూడు చెక్కలపల్లిలో శనివారం బానోత్ కొమ్మలు(36) అనే వ్యక్తి <<16081756>>హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. అయితే సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మొక్కజొన్న చేనులో కొమ్మలు మృతదేహం లభ్యమైంది. ఆయన శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌పై అప్డేట్ వచ్చింది. ‘రెబల్ సాబ్’ అనే సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.
News November 21, 2025
యాదాద్రికి కార్తీక మాసంలో ₹17.62 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఈసారి కార్తీక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నెల రోజులలో ఆలయానికి ₹17,62,33,331 చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ₹3.31 కోట్లు అధికంగా లభించాయి. ఈ మాసంలో 24,447 సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
News November 21, 2025
కుసుమ ప్రతిభకు ఎమ్మెల్యే శ్రావణి సత్కారం

దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి, దేశ కీర్తిని చాటిన నార్పల మండలం దుగుమరి గ్రామానికి చెందిన 19 ఏళ్ల కుసుమను ఎమ్మెల్యే బండారు శ్రావణి అభినందించారు. కుసుమను, ఆమె కుటుంబ సభ్యులను తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి, ఆర్థిక సాయం అందించారు. ఎవరెస్ట్‌ను అధిరోహించడమే తన లక్ష్యమని కుసుమ తెలపగా, కూటమి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


