News April 13, 2025

WGL: హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?..

image

వరంగల్(D) నల్లబెల్లి(M) మూడు చెక్కలపల్లిలో శనివారం బానోత్ కొమ్మలు(36) అనే వ్యక్తి <<16081756>>హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. అయితే సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మొక్కజొన్న చేనులో కొమ్మలు మృతదేహం లభ్యమైంది. ఆయన శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News April 10, 2026

ఇరాన్‌ కొత్త నాయకత్వం ఇంకా డేంజర్: IDF

image

ఇరాన్‌లో ఇప్పుడున్న నాయకత్వం మరింత ఎక్స్‌ట్రీమ్‌గా ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) హెచ్చరించింది. ఖమేనీ చనిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త లీడర్‌షిప్ సంప్రదాయ మత పెద్దల నుంచి కాకుండా IRGC నుంచి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రహస్య సమావేశంలో IDF ప్రతినిధులు పార్లమెంటు ఫారిన్ అఫైర్స్ కమిటీకి తెలియజేశారు. ఈ క్రమంలో యుద్ధం తిరిగి ప్రారంభం కావచ్చని కమిటీ చీఫ్ బోవజ్ బిస్ముత్ అభిప్రాయపడ్డారు.

News April 10, 2026

పాడేరులో పర్యటించిన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్

image

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డా.వర్ణాలి దేక అల్లూరి జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఐటీడీఏ పీవో శ్రీపూజతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై పీవో శ్రీపూజ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డైరెక్టర్ ముంతమామిడిలో బహుళ ప్రయోజక భవనం పరిశీలించారు.

News April 10, 2026

సిరిసిల్ల: జిల్లాలో ఈనెల 26 నుంచి స్వీయ గణన

image

ఈనెల 26 తేదీ నుంచి స్వీయ గణన ప్రక్రియ మొదలవుతుందని సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో రాష్ట్ర జనాభా గణన కార్యాలయం జేడీ సుబ్బరాజు, అధికారులతో కలిసి శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈనెల 26 నుంచి మే పదవ తేదీ వరకు స్వీయ గణన సిరిసిల్ల జిల్లాలో నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వీయ గణన చేసుకోవాలన్నారు.