News November 12, 2024
WGL: హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌కు అతి ఉత్కృష్ట సేవా పతకాలు

పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే అతి ఉత్కృష్ట సేవా పతకానికి కేయూసీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మల్లారెడ్డితో పాటు హనుమకొండ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కే.మహేశ్‌లు ఎంపికయ్యారు. అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికైన మల్లారెడ్డి, మహేశ్‌లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ అభినందించారు.
Similar News
News March 9, 2026
పోచమ్మమైదాన్ జంక్షన్‌లో ఉద్రిక్తత.. లాఠీచార్జ్

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి జెండాను ఓ వర్గానికి చెందిన యువకుడు తొలగించడంతో వివాదం చెలరేగింది. దీంతో మరో వర్గం అక్కడే మళ్లీ జెండా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
News March 9, 2026
వరంగల్: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లోని వేర్‌హౌస్ గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ఆదివారం తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ రికార్డులను పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.