News February 11, 2025
WGL: అన్నదాతకు ఊరట.. రూ.100 పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిచ్చాయి. 15 రోజుల అనంతరం నేడు మార్కెట్లో పత్తి ధర రూ.7వేల మార్క్ దాటింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,960 పలకగా.. నేడు రూ.7,060 పలికినట్లు అధికారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.100 పెరగడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 16, 2025
HYD: ORR, హైవేలపైనే అధిక యాక్సిడెంట్స్!

గ్రేటర్ HYD అవుటర్ రింగ్ రోడ్డు (ORR), దాని చుట్టూ ఉన్న జాతీయ రహదారులపై ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 52% ప్రమాద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అధికవేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాత్రి వేళల్లో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటి కారణాలు ప్రధానంగా గుర్తించారు.
News November 16, 2025
రేపు నూజివీడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నూజివీడు పట్టణ పరిధిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ..రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చు అన్నారు. ప్రతి అర్జీ ఆన్లైన్ చేయడం, నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
News November 16, 2025
HYD: వేగం ప్రాణాలు తీస్తోంది! జర పైలం

HYDలో అతివేగం కారణంగా ప్రాణ నష్టం పెరుగుతోంది. 2023- 2025 అక్టోబర్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 34% కేసులు అధిక వేగమే ప్రధాన కారణంగా గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వేగం నియంత్రణ కోల్పోవడం, ఢీ కొనడం, ఆలస్యమైన సహాయం వంటి కారణాలతో మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అధికారులు స్పష్టంచేశారు.


