News September 17, 2025

WGL: అయోమయానికి గురిచేస్తున్న పత్తి ధర!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురిచేస్తున్నాయి. సోమవారం క్వింటా రూ.7,400 ధర పలకగా.. మంగళవారం రూ.7,480 అయింది. మళ్లీ ఈరోజు(బుధవారం) ధర తగ్గి రూ. 7,440 అయింది. రైతులు తేమలేని, నాణ్యమైన పత్తి మార్కెట్‌కి తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు

Similar News

News September 17, 2025

జగిత్యాల : జడ్పీ కార్యాలయంలో జెండావిష్కరణ చేసిన కలెక్టర్

image

ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి సత్య ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో గౌతమ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

NPDCL కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం

image

హనుమకొండ NPDCL కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఎగరవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల అమరుల స్తూపం వద్ద పూలదండ వేసి నివాళులర్పించారు. ఆర్థిక ప్రగతి, సంక్షేమ లక్ష్యంగా తెలంగాణ ప్రగతి సూచికల్లో అగ్రగామి రాష్ట్రంగా మారిందన్నారు.

News September 17, 2025

ఏలూరు: కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి

image

ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆమె మాట్లాడుతూ.. వాస్తుశిల్పంలో విశ్వకర్మ చేసిన కృషిని కొనియాడారు. సాంప్రదాయ వృత్తుల సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.