News December 15, 2025

WGL: ఆదివారం కావడంతో తరలివచ్చిన ఓటర్లు

image

రెండో విడత జీపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొత్తం 564 జీపీలకు గాను 56 జీపీల్లో సర్పంచులు, 917 వార్డులు ఏకగ్రీవం కావడంతో 508 జీపీలకు, 4,020 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.ఆదివారం సెలవు దినం కావడంతో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 7,33,323 మంది ఓటర్ల కోసం 4,638 పీఎస్‌లు, 5,686 పీవోలు, 8,191 ఓపీఓలు, 5,500 మంది పోలీసులు పాల్గొన్నారు.

Similar News

News December 16, 2025

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో రికార్డు

image

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్లకు పైగా నెట్‌వర్త్‌ సాధించిన తొలి వ్యక్తిగా నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 2026లో 800B డాలర్ల విలువతో స్పేస్-X ఐపీవోకు వస్తుండటంతో మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. అక్టోబర్‌లో 500B డాలర్ల మార్క్‌ను దాటిన మస్క్, కేవలం 2 నెలల్లోనే మరో 100B డాలర్లను సంపాదించారు. ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ సుమారు $677Bగా ఉంది.

News December 16, 2025

పల్నాడు: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

సత్తెనపల్లి బోయ కాలనీలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. కొన్ని రోజులుగా ఈ గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News December 16, 2025

విశాఖలో ఐదుగురు ఎస్ఐ‌లను రేంజ్‌కు అప్పగింత

image

విశాఖ నగరంలో ఐదుగురు ఎస్ఐలపై పోలీస్ కమిషనర్ శంఖ బత్రబాగ్చి చర్యలు తీసుకున్నారు. తక్షణమే ఈ అధికారులను రేంజ్‌కు అప్పగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. త్రీటౌన్ క్రైమ్ ఎస్ఐ సల్మాన్ బేగ్, టూటౌన్ క్రైమ్ ఎస్ఐ సునీల్, పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్, ఫోర్త్ టౌన్ క్రైమ్ ఎస్ఐ విజయ్‌కుమార్, భీమిలి ఎస్సై భరత్ కుమార్ రాజులు రేంజ్‌కు అప్పగించారు. ఈ చర్య పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.