News January 5, 2026

WGL: ఆశావహుల్లో రిజర్వేషన్ల టెన్షన్..!

image

మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఓటర్ల జాబితాను కూడా ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12మున్సిపాలిటీల్లో 260 వార్డులు ఉన్నాయి. గతంలో పోటీ చేసిన వారితోపాటు అన్ని పార్టీల నుంచి పలువురు పోటీచేందుకు సిద్ధమవుతున్నారు.కానీ ఆశవాహుల్లో రిజర్వేషన్ గుబులు పుట్టిస్తోంది. ఇంతకుముందు ఉన్న రిజర్వేషన్ ఉంటుందా..మారుతుందా అన్న ఆందోళన ఆశావహులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Similar News

News February 21, 2026

వెయ్యేళ్ల నాటి సమాధిలో బంగారం, పెయింటింగ్స్

image

పనామాలోని ఎల్ కానో సైట్‌లో వెయ్యేళ్లకు పైబడిన పురాతన సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుమారు 800-1000AD మధ్య దీన్ని నిర్మించినట్లు లీడ్ రీసెర్చర్ వెల్లడించారు. అక్కడ మానవ అవశేషాలు, సిరామిక్ కళాఖండాలతోపాటు బంగారం కూడా ఉందని తెలిపారు. ‘మృతదేహానికి రెండు కంకణాలు, చెవి పోగులు, ఛాతీ ఆభరణాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇతను సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.

News February 21, 2026

జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌‌కు అక్కన్నపేట వాసి

image

అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు పులికాశీ వంశీకృష్ణ తెలంగాణ సీనియర్ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యాడు. ఆయన గుజరాత్‌లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొననున్నాడు. గ్రామానికి చెందిన క్రీడాకారుడు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకోవడం గర్వకారణమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

News February 21, 2026

సిద్దిపేట: ‘అర్రైవ్ అలైవ్’తో ట్రాఫిక్ చైతన్యం

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘అర్రైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు స్థానిక కంటెంట్ క్రియేటర్లు రూపొందించిన వీడియోలకు మంచి స్పందన లభించింది. సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలపై చిన్న వీడియోలు రూపొందించి@Siddipet_Police_Commissionerate ను ట్యాగ్ చేయాలని రష్మీ పెరుమాళ్ తెలిపారు.