News December 29, 2025

WGL: ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందే!

image

ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సుమారు 30 మంది IAS, IPS, IFS అధికారులకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2024 ఏడాదికి సంబంధించిన స్థిరాస్తి వివరాలను (IPR) జనవరి 31లోపు సమర్పించాలని పేర్కొంది. నిర్ణీత 33 రోజుల గడువులోగా వివరాలు ఇవ్వని వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు తమ ఆస్తుల డేటాను గడువులోగా ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Similar News

News January 3, 2026

BREAKING: సిద్దిపేట: స్కూల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి

image

సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి-ఎల్లుపల్లి కస్తూర్భా గాంధీ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థిని హర్షిణి అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి ఆమెను తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ మార్చురీకి మృతదేహాన్ని తరలించామన్నారు. బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన హర్షిణిగా గుర్తించారు.

News January 3, 2026

ఇందిరమ్మ ఇళ్లకూ ఫ్రీ కరెంట్: భట్టి విక్రమార్క

image

TG: కొత్తగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి కూడా ఉచిత కరెంట్ అందిస్తామని Dy.CM భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికీ పథకం అందని అర్హులెవరైనా ఉంటే MPDO, మున్సిపల్ ఆఫీసులలో ఉండే ప్రజాపాలన అధికారులను సంప్రదించొచ్చని వెల్లడించారు. విద్యుత్తు వినియోగం 200 యూనిట్లు దాటితే మాత్రం పథకం వర్తించదని తేల్చి చెప్పారు. ఫ్రీ కరెంట్ ద్వారా రాష్ట్రంలో 50%పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.

News January 3, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో పోస్టులు

image

<>ముంబై <<>>పోర్ట్ అథారిటీ 10 ఇంటర్న్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు JAN 30 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. Jr.ప్రొఫెషనల్ ఇంటర్న్(హిందీ), Jr.ప్రొఫెషనల్ ఇంటర్న్ (మరాఠీ), Jr.ప్రొఫెషనల్ ఇంటర్న్(HR అసోసియేట్) పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ(ఇంగ్లిష్, హిందీ, మరాఠీ), డిప్లొమా, MBA(HR) ఉత్తీర్ణులు అర్హులు. గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: mumbaiport.gov.in