News March 24, 2025
WGL: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్‌లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడుతుందా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? స్టే.ఘనపూర్‌లో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News July 6, 2025
వికారాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత పరిశీలన

వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత అమలు తీరును పర్యవేక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, వాష్ రూమ్స్, పాఠశాల పరిసరాలు, తరగతి గదుల పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. పరిశుభ్రతపై తనిఖీ చేసేందుకు బృందాలు త్వరలోనే పర్యటించనున్నారు. జిల్లాలో 1,108 పాఠశాలలో ఉండగా, 82,300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
News July 6, 2025
బోరబండలో భార్యను హత్య చేసిన భర్త

HYD బోరబండ PS పరిధిలో భార్యను భర్త హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సోనీ, నర్సింలు దంపతులు. మద్యానికి బానిసై నర్సింలు తాగివచ్చి తరుచూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో భార్య సోనీ తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత 3 రోజులుగా మళ్లీ చిత్రహింసలు పెడుతూ విచక్షణారహితంగా కొట్టడంతో సోనీ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
వీరపనేనిగూడెంలో ప్రమాదం.. ఒకరి మృతి

గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో తెంపల్లికి చెందిన షేక్ యూసఫ్ బాషా (28) మృతి చెందాడు. తాపీ పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ఇటుకబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.