News February 26, 2025

WGL: ఈనెల 27న డయల్ యువర్ డీఎం కార్యక్రమం

image

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్-1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు. ఈనెల 27న ఉ.9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రయాణికులు 9959226047 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు, సలహాలు, సూచనలు తెలపాలని కోరారు.

Similar News

News February 26, 2025

NZB: శివాలయానికి వెళ్లొచ్చే సరికి మూడిళ్లలో చోరీ

image

శివరాత్రికి దేవాలయాలకు వెళ్లి వచ్చే సరికి అగంతకులు తాళం వేసిన మూడిళ్లలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గంగస్థాన్ నుంచి కేశాపూర్ వెళ్ళేదారిలో రియల్టర్ బలరాం రెడ్డి ఇంట్లో 25 తులాల బంగారం, ఆర్టీసీ కాలనీలోని రవీందర్ ఇంట్లో 2 తులాల బంగారం, ఏక శిలా నగర్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలోని కిరాణ వ్యాపారి రవీందర్ ఇంట్లో రూ.60 వేల నగదును అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 26, 2025

పాలకుర్తి: ఘనంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

image

పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకుల వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ఆలయ ఈవో మోహన్ బాబు, ప్రజాప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News February 26, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖ జిల్లా వ్యాప్తంగా మార్మోగిన శివనామస్మరణ
➤ రేపు 13 కేంద్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
➤ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని పాఠశాలలకు సెలవు
➤ త్వరలో విశాఖ మెట్రో పనులు ప్రారంభం?
➤ మల్కాపురానికి చెందిన 22 ఏళ్ల యువకుడు మృతి
➤ ఆర్.కే, అప్పికొండ, భీమిలి బీచ్‌లలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేసిన అధికారులు

error: Content is protected !!