News February 6, 2025

WGL: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్, ఆర్.ఆర్.బీ, ఎస్.ఎస్.సి. ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుకు ఈ నెల 9 వరకు అవకాశం ఉందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. అర్హత గల అభ్యర్థులు https://tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి ఈ నెల 15 నుంచి శిక్షణ ఉంటుందన్నారు.

Similar News

News February 6, 2025

కొండపాక: సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

కొండపాక మండలంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని బియ్యం, నిత్యావసర వస్తువులు, వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులకు సూచించారు.

News February 6, 2025

కందుకూరు YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులు వీరే..

image

కందుకూరు నియోజకవర్గ YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. యువజన విభాగం: మద్దసాని నవీన్ కృష్ణ, మహిళా విభాగం: Tఆదిలక్ష్మి, రైతు విభాగం: N చంద్రమౌళి, లీగల్ సెల్: కొత్తూరి హరికోటేశ్వరరావు, SCసెల్: దగ్గుమాటి కోటయ్య, STసెల్: చేవూరి శ్రీనివాసమూర్తి, గ్రీవెన్స్ సెల్: Yనాగభూషణం, మున్సిపల్ వింగ్: పిడికిటి శంకర్, బూత్ కమిటీస్: కోడూరి వసంతరావు తదితరులు నియమితులయ్యారు.

News February 6, 2025

ఒక్కరోజు వ్యవధిలోనే గుండెపోటుతో తండ్రి, కొడుకు మృతి

image

ఒక్కరోజు వ్యవధిలోనే తండ్రి, కొడుకు గుండెపోటుతో మృతి మృతిచెందారు. ఈ విషాద ఘటన మండల కేంద్రం చాగలమర్రిలో జరిగింది. కోటగడ్డ వీధికి చెందిన కుమారుడు ముల్లా రబ్బాని(28) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందగా, ఆ బాధతో తండ్రి జహంగీర్ బాషా(60) నేడు గుండెపోటుకు గురై మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!