News March 10, 2025

WGL: ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ

image

వరంగల్ జిల్లాలోని పలు చోట్ల నేడు పొగమంచు కమ్ముకుంది. ఈ క్రమంలోనే నెక్కొండ మండలంలో ఈరోజు తెల్లవారుజామున పొలం పనులకు, స్కూళ్లకు, అవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. అలాగే మధ్యాహ్నం సమయంలో భానుడు సైతం తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని, ఎండ దంచి కొడుతుందని ప్రజలు తెలుపుతున్నారు. మండలంలో విచిత్ర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.

Similar News

News March 10, 2025

వరంగల్: సింగల్ పట్టి మిర్చి రూ. 39వేలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి సోమవారం అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.17వేలు పలకగా,1048 రకం మిర్చి రూ.11వేలు, 5531 రకం మిర్చికి రూ. 11,300 ధర వచ్చింది. అలాగే ఎల్లో మిర్చికి రూ.20 వేలు, టమాటా మిర్చికి రూ.28వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.39వేల ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.

News March 10, 2025

WGL: ఆర్జీలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

image

ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను పరిశీలించి, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి ఆమె స్వయంగా అర్జీలను స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

News March 10, 2025

WGL: క్విటా మొక్కజొన్న ధర రూ.2,305

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,305 ధర పలికింది. గతవారం రూ.2,400కు పైగా పలికిన మొక్కజొన్న ధర ఈవారం తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. అలాగే చాలా రోజుల తర్వాత ఈరోజు మార్కెట్‌కు కొత్త పసుపు తరలిరాగా.. రూ.7,607 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోల్లు-అమ్మకాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

error: Content is protected !!