News March 10, 2025
WGL: ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ

వరంగల్ జిల్లాలోని పలు చోట్ల నేడు పొగమంచు కమ్ముకుంది. ఈ క్రమంలోనే నెక్కొండ మండలంలో ఈరోజు తెల్లవారుజామున పొలం పనులకు, స్కూళ్లకు, అవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. అలాగే మధ్యాహ్నం సమయంలో భానుడు సైతం తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని, ఎండ దంచి కొడుతుందని ప్రజలు తెలుపుతున్నారు. మండలంలో విచిత్ర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.
Similar News
News July 4, 2025
నల్గొండ జిల్లాలో యువకుడి ఆత్మహత్య

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జక్కలి మత్స్యగిరి(22) పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 4, 2025
శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

AP: శ్రీశైల మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనానికి ఇకపై ఆన్‌లైన్ టోకెన్లు పొందవచ్చని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం-శుక్రవారం వరకు మ.1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవచ్చన్నారు. వచ్చేవారం నుంచి టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, ఇందుకోసం https://www.srisailadevasthanam.org/en-in సైట్‌లో ఒక రోజు ముందుగా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు.
News July 4, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా? క్లారిటీ!

మొహర్రం పురస్కరించుకుని గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఆప్షనల్, ఆదివారం పబ్లిక్ హాలిడే ప్రకటించారు. అయితే ఏపీలో రేపు స్కూళ్లకు రావాల్సిందేనని టీచర్లను అధికారులు ఆదేశించారు. పాఠశాలలోని 50% మంది టీచర్లు విధులకు రావాలని, పిల్లలకు యథావిధిగా క్లాసులు నిర్వహించాలని సూచించారు. అటు తెలంగాణలో రేపు హాలిడే ఉంటుందని మెసేజులు రాలేదు. మరి మీకు రేపు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.