News December 9, 2025

WGL: ఉద్యోగులారా.. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోండి..!

image

ఎన్నికల విధులకు నియమించిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 11, 14, 17న ఎన్నికలు జరుగుతుండగా ఉద్యోగులు తమ ఓటు హక్కు ఉన్న మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయవచ్చు. ఇందుకోసం వారు ఎన్నికల డ్యూటీ ఆర్డర్ కాపీ, ఉద్యోగ గుర్తింపు కార్డు, ఓటరు కార్డును ఆ సెంటర్లో ఇచ్చే ఫారం-14, 15జత చేసి ఓటేయొచ్చు.

Similar News

News December 12, 2025

పొందూరు ఖాదీకి GI ట్యాగ్‌ గుర్తింపు

image

పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మక GI ట్యాగ్‌ లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు X వేదికగా ప్రకటించారు. ఇది శ్రీకాకుళం నేతకార్మికుల వారసత్వానికి లభించిన అపూర్వ గౌరవమని తెలిపారు. గాంధీజీకి ప్రియమైన పొందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్ర ఉందని, ఎన్నో కష్టాల మధ్య ఈ కళను కాపాడిన నేతకార్మికులే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. GI ట్యాగ్‌తో ఖాదీ మార్కెట్‌ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News December 12, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

* ఎల్లారెడ్డి: ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం
* కామారెడ్డి: రెండో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్
* బిక్కనూర్: తెల్లవారుజామున తేలిన సర్పంచ్ ఫలితం
*బిక్కనూర్: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఒకరికి గాయాలు
* జుక్కల్: ప్రారంభమైన మూడో విడత ఎన్నికల ప్రచారం
* మాచారెడ్డి; మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: ASP

News December 12, 2025

కరీంనగర్: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్ విధానంలో పూర్తయింది. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సాధారణ పరిశీలకులు వెంకటేశ్వర్లు సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. అనంతరం ఆయన డీపీవో జగదీశ్వర్‌తో కలిసి బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.