News February 15, 2025
WGL: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్, సంగంరెడ్డి సుందర్ రాజ్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News December 19, 2025
టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు రెండ్రోజుల అవకాశం!

AP: టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇవాళ, రేపు అవకాశం కల్పించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. విద్యార్థులు రూ.500 ఫైన్‌తో HMల లాగిన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చన్నారు. తక్కువ వయస్సున్న విద్యార్థులు వయసు మినహాయింపు ఫీజును బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఒకేషనల్ విద్యార్థులూ ఇదే సైట్‌లో ఫీజులు కట్టొచ్చని చెప్పారు.
News December 19, 2025
చిత్తూరు: రూ.3.73 కోట్ల పన్ను వసూళ్లు

చిత్తూరు జిల్లా గ్రామాల్లో పన్ను వసూళ్లలో మెరుగైన స్థానంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.17.60 కోట్ల మేర డిమాండ్ ఉండగా, ఇప్పటివరకు రూ.3.70 కోట్లు వసూలైంది. రూ.3.26 కోట్ల బకాయిలకు రూ.53 లక్షలు వసూలైంది. మొత్తంగా రూ.4.23కోట్లు వచ్చాయి. 20 శాతం వసూళ్లతో జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్నట్లు ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది.
News December 19, 2025
ఎచ్చెర్ల: ఫలితాలు విడుదల

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://brau.edu.inలో పొందుపరిచినట్లు తెలిపారు. మొత్తం 178 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 85 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.


