News February 25, 2025
WGL: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News February 21, 2026
KNR: అటు అన్నదాత.. ఇటు విద్యార్థికి సవాలే!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఒక విలక్షణమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు రైతులకు నీటి కోసం పరీక్ష ఎదురవుతుంటే, మరోవైపు తరగతి గదుల్లో వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అగ్నిపరీక్ష మొదలైంది. ఈ గడ్డు కాలాన్ని తట్టుకుని నిలబడితేనే రైతులకు లాభం, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. అటు వ్యవసాయ క్షేత్రం, ఇటు విద్యా క్షేత్రం రెండూ ఇప్పుడు జిల్లా అభివృద్ధికి కీలక పరీక్షగా నిలిచాయి.
News February 21, 2026
వాయిదా తీర్మానం అంటే తెలుసా?

అసెంబ్లీ కానీ శాసనమండలి కానీ అజెండా ప్రకారం ప్రతి రోజు సభ కొనసాగుతుంది. కానీ ప్రాముఖ్యమైన విషయాన్ని చర్చించేందుకు సభ్యులు వాయిదా తీర్మానాన్ని కోరతారు.అప్పుడు స్పీకర్ గానీ ఛైర్మన్ గానీ ప్రస్తుత అజెండాను వాయిదా వేసి తీర్మానానికి అంగీకరిస్తారు. దీనికి మెజారిటీ సభ్యుల అంగీకారం కావాలి. ఏపీ కౌన్సిల్‌లో కల్తీ నెయ్యి, హెరిటేజ్ విషయంపై ప్రతిపక్ష వైసీపీ వాయిదా తీర్మానాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.