News February 25, 2025
WGL: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News February 25, 2025
NEPను వ్యతిరేకిస్తూ బీజేపీ నేత రాజీనామా

తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రగడ మరింతగా ముదురుతోంది. తాజాగా బీజేపీ నేత, నటి రంజనా నాచియార్ ఈ పాలసీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విద్యార్థులపై బలవంతంగా మూడు భాషలను రుద్దడం అనేది చాలా తప్పని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తమ రాష్ట్రంలో అమలు చేయమని సీఎం స్టాలిన్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.
News February 25, 2025
వరంగల్: 75 వేలకు పైగా మిర్చి బస్తాలు రాక

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు వరంగల్ మార్కెట్‌కు సెలవులు ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం మార్కెట్‌కి రికార్డు స్థాయిలో 75 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే మిర్చి ధరలు భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 25, 2025
నటిపై కేరళ కాంగ్రెస్ ఆరోపణలు.. రియాక్షన్ ఇదే

న్యూఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.18 కోట్ల లోన్ విషయంలో మోసానికి పాల్పడ్డారని కేరళ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను నటి ప్రీతి జింటా ఖండించారు. పదేళ్ల క్రితమే తాను లోన్ తీసుకొని తిరిగి చెల్లించినట్లు స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. తన SM అకౌంట్లను తానే హ్యాండిల్ చేస్తానని, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయొద్దన్నారు. ఓ రాజకీయ పార్టీ ఇలాంటి ప్రచారం చేయడం షాక్‌కు గురిచేసిందని చెప్పారు.