News December 28, 2025
WGL: ఎయిర్‌పోర్ట్ భూములు కబ్జా.. సర్వేకు నిర్ణయం

మామునూరు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు చెందిన <<18691529>>706 ఎకరాల్లో కబ్జా<<>>కు గురైన 9.86 ఎకరాల భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఎయిర్‌పోర్ట్ భూసేకరణ చివరి దశకు వచ్చిన సమయంలో ఈనెల 27న WGLకు వచ్చిన ఏఏఐ HYD విభాగం జనరల్ మేనేజర్ నటరాజు, డైరెక్టర్ వీవీ రావు కలెక్టర్, రెవెన్యూ అధికారులతో ఏఐకి చెందిన భూములు పరిశీలించి, కబ్జా అయిన భూములను సర్వే చేయాలని కోరారు.
Similar News
News December 31, 2025
న్యూ ఇయర్ విషెస్.. ఈ మెసేజ్‌లతో జాగ్రత్త!

WhatsAppలో వచ్చే న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. .APK, .XAPK లింక్‌తో వచ్చే ఫొటోలు, వీడియోలపై క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. వాటిలో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయి ఉంటుందని, క్లిక్/డౌన్లోడ్ చేస్తే పర్సనల్/బ్యాంక్ అకౌంట్స్ డేటా చోరీ అయ్యే ఛాన్సుందని చెబుతున్నారు. ఇలాంటి మెసేజ్‌లు తెలిసిన నంబర్ల నుంచి వచ్చినా క్లిక్ చేయవద్దంటున్నారు.
News December 31, 2025
ఇంటికి 3 గడపలు ఉండకూడదా?

ఒకే గోడకి 3 గుమ్మాలు ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, భద్రతాపరంగానూ ఇది మంచిది కాదంటున్నారు. ‘అయితే ఇంటి లోపల ఒకదాని వెనుక మరొకటి.. అలా వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చు. వాస్తు ఎప్పుడూ సరి సంఖ్యలో ద్వారాలకు ప్రాధాన్యమిస్తుంది. ఒకవేళ 3 గుమ్మాలు తప్పనిసరైతే, మూడో ద్వారం వేరే దిశలో ఏర్పాటు చేసుకుంటే వాస్తు దోషాన్ని నివారించవచ్చు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 31, 2025
కుమ్మపల్లిలో యాక్సిడెంట్..ఓ వ్యక్తి స్పాట్ డెడ్

వేపాడ మండలం కుమ్మపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. దేవరాపల్లి మండలం ముత్యాలమ్మ పాలెంకు చెందిన చౌడువాడ దేవుడు నాయుడు బుధవారం తన స్నేహితుడు మహేష్‌తో కలసి బైక్‌పై కుమ్మపల్లి వెళుతుండగా రోడ్డు మలుపులో బైక్ అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో గాయపడిన చౌడు నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


