News December 13, 2025

WGL: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు తత్కాల్ అవకాశం

image

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ 2025-26 విద్యాసంవత్సర ప్రవేశాలకు తత్కాల్ స్కీం కింద మరోసారి అవకాశం కల్పించినట్లు HNK డీఈఓ గిరిరాజ్ గౌడ్, ఉమ్మడి WGL జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం తెలిపారు. అపరాధ రుసుంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.TOSS వెబ్‌సైట్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని, డాక్యుమెంట్లు సంబంధిత అక్రిడిటెడ్ విద్యాసంస్థల్లో సమర్పించాలని సూచించారు.

Similar News

News December 27, 2025

మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి: రేవంత్

image

TG: జనవరి 5 నుంచి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం బచావో కార్యక్రమం చేపట్టాలని CWC సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. పలు ప్రయోజనాలతో తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు Xలో రాసుకొచ్చారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఈ పథకాన్ని కాపాడుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

News December 27, 2025

రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న మదనపల్లె విద్యార్థిని

image

మదనపల్లె జవహర్ నవోదయ విద్యాలయం కామర్స్ విభాగంలో 12వ తరగతి చదువుచున్న విద్యార్థిని శివాని ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారానికి ఎంపికైంది. 26వ తేదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విద్యార్థిని అవార్డు అందుకుంది. జావెలిన్ త్రో, షాట్ పుట్‌లో ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. శివాని 2023 గుజరాత్ లోను 2024లో బెంగుళూరులో జరిగిన పారా జాతీయ క్రీడల్లో జావలిన్ త్రో ప్రతిభను కనబరిచింది.

News December 27, 2025

KNR: ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన పోస్టర్ ఆవిష్కరణ

image

ఈ నెల 30న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించనున్న ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమ పోస్టర్‌ను కరీంనగర్‌లో శనివారం ఆవిష్కరించారు. మన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు సిద్ధి సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంద నగేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన ముదిరాజ్ ప్రజాప్రతినిధులను గౌరవించుకోవడం ద్వారా రాజకీయ చైతన్యం పెంచడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు.