News December 27, 2025
WGL: కథా శివిర్‌కు 20 మంది విద్యార్థులు

దేశ యువతలో జాతీయత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు గుజరాత్ ఉప్లేటా-ప్రాధా గ్రామంలో నిర్వహిస్తున్న 26వ రాష్ట్రీయ కథా శివిర్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. శివిర్ ఈ నెల 27 నుంచి జనవరి 4 వరకు కొనసాగనుంది.
Similar News
News December 28, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారంలో అత్యల్పంగా 10.5℃ నమోదైంది. అటు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ములకాలపల్లిలో 10.7℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్లో 10.8℃, జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో 11℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 28, 2025
MBNR: U-14..హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక

MBNRలోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్-14 బాల, బాలికలకు హ్యాండ్ బాల్ జట్టు ఎంపికలు నిర్వహించారు. మొత్తం 70 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారు నారాయణపేటలో నేటి నుంచి ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు హాజరవుతున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు.పీడీలు వేణుగోపాల్, రవి, శంకర్, జియావుద్దీన్,గనేశ్వరి పాల్గొన్నారు.
News December 28, 2025
NGKL: ఆల్ ఇండియా క్రికెట్ టోర్నీ.. నేడు ఫైనల్

నాగర్‌కర్నూల్‌లోని జడ్పీహెచ్ఎస్ మైదానంలో గత వారం రోజుల నుంచి ఆలిండియా లెవెల్ ఓపెన్ T-20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. నేడు(ఆదివారం) “Dolly CC NGKL vs MRCC Chennai” ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు “Way2News” ప్రతినిధితో తెలిపారు. ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ (SATG) ఛైర్మన్‌గా శివసేన రెడ్డి హాజరుకానున్నారు.


