News May 4, 2024
WGL: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫిక్స్.. BJP నుంచి అతనేనా..?

WGL-NLG-KMM పట్టభద్రుల MLC నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేయగా.. BRS తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన రాకేష్ రెడ్డిని ప్రకటించింది. BJP నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News April 22, 2025
INTER RESULTS.. వరంగల్‌లో ఎంత మంది పాస్ అయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో వరంగల్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 5,401 మంది పరీక్షలు రాయగా 3,709 మంది ఉత్తీర్ణత సాధించారు. 68.67 పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 5,814 మందిలో 3,368 మంది ఉత్తీర్ణులు కాగా.. 57.93 పాస్ పర్సంటేజీ నమోదైంది.
News April 22, 2025
వరంగల్: తేలనున్న 12,321 మంది విద్యార్థుల భవితవ్యం!

వరంగల్ జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 12,321 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్‌లో 4,967 మంది, ఒకేషనల్- 848, ద్వితీయ సంవత్సరం జనరల్-5,739, ఒకేషనల్ 767 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్‌లో చూసుకోవచ్చు. #SHARE IT
News April 22, 2025
ములుగు జిల్లాలో దారుణం.. వ్యక్తి హత్య!

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాశ్ ఈ నెల 15న హనుమకొండలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణ చేపట్టగా ఓ కానిస్టేబుల్ సుపారి గ్యాంగ్‌తో కలిసి సాయి ప్రకాశ్‌ను హత్య చేసినట్లు తెలిసింది. మండలంలో ఎంతోమంది గర్భిణులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, ఆదివాసులకు సేవ చేసిన సాయి ప్రకాశ్ మృతితో మండలంలో విషాదం నెలకొంది.