News August 29, 2025
WGL: కృష్ణా ఎక్స్ ప్రెస్ రద్దు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కామారెడ్డి జిల్లాలో రైల్వే పట్టాల కింద ఉన్న కంకర, మట్టి వరదతో కొట్టుకుపోయి రైల్వే లైన్ దెబ్బతింది. దీంతో శుక్రవారం తిరుపతి నుంచి ఆదిలాబాద్ రావాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నంబర్ 17405)ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
Similar News
News August 29, 2025
కంచిలి: రైలు ప్రయాణికులకు గమనిక

బ్మహపురం నుంచి సోంపేట మీదుగా విశాఖకు వెళ్లే ప్యాసింజర్ రైలు అనివార్య కారణాలతో మంగళవార, గురువారం, శుక్రవారం మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 4:20 గంటలకు బరంపురం నుంచి విశాఖపట్నం ప్రయాణించే ప్యాసింజర్ రైలు సర్వీసును నియంత్రించడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News August 29, 2025
ANU: దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీడీఈ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి సెమిస్టర్ విధానంలో యూజీసీ, డెబ్ 23 పీజీ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 10వ తేదీతో ముగుస్తుందన్నారు. వివరాలకు www.anucde.info వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.
News August 29, 2025
చిత్తూరు: సీఎం చంద్రబాబు కరుణిస్తారా..?

హంద్రీ నీవా ద్వారా కృష్ణమ్మ వందల కిలో మీటర్లు ప్రయాణించి కుప్పం ఏరియాకు చేరింది. ఈక్రమంలో మదనపల్లె తూర్పు మండలాలల్లో నీటి సమస్య తీర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మదనపల్లె నుంచి సీటీఎం చెరువుకు హంద్రీనీవా కనెక్టివిటీ కాలువ నిర్మించి నీటిని తరలించాలని కోరుతున్నారు. సీఎం చంద్రబాబు ఆ దిశగా కృషి చేయాలని కోరుతున్నారు. సీఎం కరుణిస్తారా? లేదా? చూడాలి మరి.