News March 13, 2025
WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం మక్కలు (బిల్టి) క్వింటాకు రూ.2,310 ధర పలకగా.. బుధవారం రూ.2,305కి చేరింది. ఈరోజు మళ్లీ రూ.10 తగ్గి రూ.2,300కి పడిపోయింది. అలాగే సూక పల్లికాయ క్వింటాకి రూ.7,150 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News March 14, 2025
సిద్దిపేట జిల్లాలో బాలిక ఆత్మహత్య

జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2025
WPL: ఈ సారైనా కప్పు కొట్టేనా?

WPL 2025లో కప్పు కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడనున్నాయి. మూడో సారి ఫైనల్ చేరిన DC జట్టు ఈ సారైనా కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు MI రెండోసారి ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ఎదురుచూస్తోంది. అయితే ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబైపై ఢిల్లీదే పైచేయి కావడం ఆ జట్టుకు సానుకూలంగా ఉంది. మరి రేపు జరిగే తుది పోరులో DC ఇదే జోరు కొనసాగిస్తుందో డీలా పడుతుందో చూడాలి.
News March 14, 2025
కాటారం: ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినా చిక్కని పెద్దపులి

కాటారం మండలం వీరాపూర్ అడవుల్లో లేగ దూడపై దాడి చేసి చంపిన పెద్దపులి మళ్లీ ఇప్పటి వరకు అటువైపు రాలేదు. లేగ దూడను చంపిన ప్రదేశంతో పాటు పలు ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినా పెద్దపులి చిక్కలేదని తెలుస్తోంది. లేగ దూడను చంపి అన్నారం వైపుగా వెళ్లినట్లు అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించారు. పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లొద్దని, పులికి హాని కలిగించే చర్యలు చేపట్ట వద్దని హెచ్చరిస్తున్నారు.