News March 26, 2025

WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మక్కలు (బిల్టి) క్వింటాకి సోమవారం రూ. 2265 పలకగా.. మంగళవారం రూ.2,250 పలికింది. బుధవారం మరింత తగ్గి రూ.2245కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయ క్వింటాకు రూ.6050 ధర రాగా.. పచ్చి పల్లికాయకి రూ.4300 ధర వచ్చింది.

Similar News

News November 8, 2025

కీరాతో ఎన్నో లాభాలు

image

కీరా దోసకాయ అంటే తెలియని వారెవరూ ఉండరు. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నోలాభాలుంటాయంటున్నారు నిపుణులు. *కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. *C, K విటమిన్లు, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *పీచు అధికంగా ఉన్నందున జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వ్యర్థాలను తొలగించి, పొట్ట, పేగులను శుభ్రపరుస్తుంది. * దీన్ని తినడం వల్ల గుండెఆరోగ్యంగా ఉంటుంది.

News November 8, 2025

పిట్లం: బువ్వ విలువ తెలిసిన అవ్వ..!

image

వరి కోతలు చివరి దశకు చేరుకోవడంతో, రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్లపై రాశులుగా ఆరబెట్టారు. ఈ ధాన్యం ఎండిన తరువాత రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో, బువ్వ విలువ తెలిసిన కొందరు వృద్ధ మహిళలు రోడ్లపై పడివున్న ధాన్యపు గింజలను వృథా చేయకుండా సేకరించారు. రాళ్లు లేకుండా శుభ్రం చేసి జాగ్రత్తగా సంచుల్లో నింపుకున్నారు. పిట్లం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై శనివారం కనిపించిన దృశ్యమిది.

News November 8, 2025

అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత: కామారెడ్డి SP

image

KMR జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాలోని 5 గురుని పోలీసులు పట్టుకున్నారు. దేవునిపల్లిలో (కారు, విడి భాగాలు చోరీ), కామారెడ్డి, సదాశివనగర్, భిక్కనూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 15 దొంగతనాలు (బంగారం, వెండి, నగదు, బైక్‌లు చోరీ) ఒప్పుకున్నట్లు SP రాజేష్ చంద్ర పేర్కొన్నారు. NZB, నిర్మల్ జిల్లాల్లోనూ నేరాలకు పాల్పడ్డట్లు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.