News October 11, 2025
WGL: గాడి తప్పుతున్న ఖాకీలు..!

పోలీసు స్టేషన్లు MLAల అడ్డాగా మారిపోయాయా అంటే అవుననే తరహాలో ఘటనలు ఓరుగల్లులో చోటు చేసుకుంటున్నాయి. ఇక MLAల పేరు చెప్పి చోటా మోటా నాయకులు తమకు ఎదురు తిరిగిన వారిని పోలీసుల ఎదుటే కొట్టే స్థాయికి వెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందో నిన్నటి కేయూ పీఎస్ ఘటనే సాక్ష్యంగా నిలిచింది.పోలీసుల ఎదుటే బాధితుడిపై ఓ కాంగ్రెస్ నేత చేయి చేసుకోవడం కలకలం సృష్టించింది. సీసీ కెమెరాల్లో రికార్డైనా కేసు పెట్టనట్టు తెలుస్తోంది.
Similar News
News October 11, 2025
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం క్యాన్సర్ లక్షణాలు

*అతిగా బరువు తగ్గిపోవడం, జ్వరం, అలసట
*శరీర రంగు నల్లగా, చర్మం ఎర్రగా మారడం. దురద రావడం
*మూత్రానికి వెళ్లేటప్పుడు నొప్పి. మూత్రంలో రక్తం పడటం
*పుట్టుమచ్చలు పెరిగి వాటి నుంచి రక్తం కారడం. చిన్న గాయాలైనా ఎక్కువ కాలం మానకపోవడం
*రొమ్ములు, వృషణాలు, గ్రంథులు, కణజాలాలు గట్టిగా మారడం
> లుకేమియా, స్కిన్, బ్రెస్ట్, పెద్దపేగు, నోటి లాంటి క్యాన్సర్ రకాలను బట్టి ఈ లక్షణాలు కనిపిస్తాయి. డాక్టర్లను సంప్రదించాలి.
News October 11, 2025
విషపూరిత దగ్గు మందు.. తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే: CDSCO

మధ్యప్రదేశ్‌లో 23 మంది పిల్లల మరణాలకు తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) పేర్కొన్నట్లు NDTV తెలిపింది. కోల్డ్రిఫ్ సిరప్ తయారు చేసే ‘Sresan’ కంపెనీలో తనిఖీలు చేయలేదని, దీనివల్ల ఆ విషపూరితమైన సిరప్ మార్కెట్లోకి వచ్చిందని చెప్పింది. ఆ సంస్థలో అసలు ఆడిట్ జరగలేదని, సెంట్రల్ పోర్టల్‌లోనూ రిజిస్టర్ కాలేదని వెల్లడించింది.
News October 11, 2025
BREAKING: జూబ్లీహిల్స్‌లో BJP కీలక నేత రాజీనామా

BJP జూబ్లీహిల్స్ నియోజకవర్గ మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. CM రేవంత్ రెడ్డి, BJP గుట్టుచప్పుడు కాకుండా చేతులు కలిపి తెలంగాణను మోసం చేస్తున్నారని ఆరోపించారు. BJP, కాంగ్రెస్ కలిసి బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ప్రజలను మోసం చేశారని, రైతులు, యువత, మహిళలు, బీసీలు బాధలో ఉన్నా BJP మౌనంగా ఉందని, ఇక తాను పార్టీలో కొనసాగలేనని TBJP చీఫ్ రాంచందర్‌రావుకు లేఖ రాశారు.