News December 1, 2025
WGL: గుర్తుల పంచాయితీ!

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.
Similar News
News April 13, 2026
వికారాబాద్: ప్రజావాణికి 138 ఫిర్యాదులు: కలెక్టర్

నేటి ప్రజావాణికి 138 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరం పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News April 13, 2026
వనపర్తి: అదనపు కలెక్టర్‌గా వినోద్ కుమార్ బాధ్యతల స్వీకారం

వనపర్తి జిల్లా నూతన అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా వినోద్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఎన్నికల విభాగం నుంచి బదిలీపై వచ్చిన ఆయన, బాధ్యతలు చేపట్టే ముందు కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లా పాలనలో తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
News April 13, 2026
ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 63 వినతులు అందగా, వాటిపై సమగ్ర విచారణ జరిపి పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం పోషణ్ పక్వాడా, పీఎం ఇంటర్న్‌షిప్ పథకాల పోస్టర్లను ఆవిష్కరించారు.


