News January 27, 2025
WGL: గోల్డ్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
జనవరి 23 నుంచి 26 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని సాయి గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన అనంత్ బజాజ్ మెమోరియల్ తెలంగాణ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్- 2025లో సామల శ్రీ చేతన్ శౌర్య గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా క్రీడాకారుడిని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్, కోచ్ మాడిశెట్టి శ్రీధర్ అభినందించారు.
Similar News
News January 27, 2025
జనగామ జిల్లాలో రైతులకు రూ.15.91 కోట్లు జమ
జనవరి 26న రైతుభరోసా పథకం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ.6 వేలు చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జనగామ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఈ మేరకు రైతు భరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున జనగామ జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 రైతులకు రూ.15.91 కోట్లు జైనట్లు తెలిపారు.
News January 27, 2025
పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు: ఎస్పీ
ఉద్యోగ సాధనలో పట్టుదల ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని అనంతపురం ఎస్పీ జగదీశ్ అభిప్రాయపడ్డారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో అర్హత సాధించి మెయిన్స్‌కు ఎంపికైన ఎస్కేయూ విద్యార్థులు 150 మందికి, జిల్లా హోమ్ గార్డులు 20 మందికి ఎస్పీ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ అందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పట్టుదల, అంకిత భావంతో ఏదైనా సాధించవచ్చని అన్నారు.
News January 27, 2025
8 మంది బందీలు మరణించారు: హమాస్
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తొలి విడతలో హమాస్ 33 మంది బందీల విడుదలకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో 8 మంది చనిపోయినట్లు హమాస్ వెల్లడించిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఇప్పటికే ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ క్రమంలో పలువురు బందీలు మరణించడంపై ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.