News November 24, 2025

WGL: జల వనరుల సర్వేలు: సీపీవోలే కన్వీనర్లు

image

వరంగల్‌లో జల వనరుల గణనలో భాగంగా, గ్రామాల్లోని చెరువుల నుంచి చిన్న చేదబావుల వరకు ప్రతీ నీటి వనరును సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో నమోదు చేస్తున్నారు. ప్రతి వనరుకు ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ సర్వేకు సీపీవోలు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. నీటి నిర్వహణ, సంరక్షణ, భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన సమగ్ర డేటాబేస్‌ను సిద్ధం చేయడమే ఈ గణన ప్రధాన లక్ష్యం.

Similar News

News November 24, 2025

మంథనిలో మహిళా సాధికారతపై మంత్రి శ్రీధర్ బాబు ఫోకస్

image

మంథని ఎక్లాస్‌పూర్‌లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు, మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. VIATRIS సాయంతో 21 కుట్టు కేంద్రాలు, 850 మిషన్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా కుట్టు కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు వంటి యూనిట్లతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

News November 24, 2025

మంథని నుంచి జాతీయ వేదికకు.. కృష్ణ త్రీడీ ప్రతిభకు గౌరవం

image

JNTUH డైమండ్ జూబ్లీ వేడుకల్లో 3D ఆర్టిస్ట్ మంథనికి చెందిన ఎస్ఎస్ఆర్ కృష్ణకు యంగ్ అచీవర్ అవార్డు ప్రదానం చేశారు. JNTU కొండగట్టు నుంచి అవార్డు పొందిన ఏకైక విద్యార్థి కావడం విశేషం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, మంత్రి శ్రీధర్ బాబు కృష్ణ 3D ఆర్ట్‌ను ప్రశంసించారు. దక్షిణ భారతంలో అరుదైన 3D ఆర్ట్‌ను అభివృద్ధి చేస్తున్న కృష్ణకి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.

News November 24, 2025

ముంబైలో “పాతాళ్ లోక్” నెట్‌వర్క్‌

image

ముంబైని ‘ట్రాఫిక్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందుకు MH ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముంబైలో భారీ టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మిస్తామని CM దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ టన్నెల్‌ నెట్‌వర్క్‌ ఇప్పటికే ఉన్న రోడ్లతో ప్యారలల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ సొరంగ మార్గాన్ని ఫేమస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’తో ఫడణవీస్ పోల్చారు. ఈ నెట్ వర్క్‌తో ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు.